ముద్దాయిపేట లోతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 3,పుల్కల్ మండలప్రతినిధి పెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంముద్దాయిపేట లో ,తేదీ: 02/06/2026 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయంవద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ యాదయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ ప్రవీణ యాదయ్య మాట్లాడుతూ, “ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేం. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలి” అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాతరి ప్రవీణ యాదయ్య.పంచాయతీ కార్యదర్శి జహీంగీర్. ఉపసర్పంచ్ పెద్దగొల్లసత్యనారాయణ.వార్డుసభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, బండారినర్సింలు. పెద్దగొల్లవిజయ్ కుమార్. గ్రామ ప్రజలుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, రాష్ట్ర ప్రగతికి కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *