పయనించే సూర్యుడు న్యూస్ జులై 13,2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ యెమ్మిగనూరు డిపో గంజిహಳ್ಳಿ బస్సు సర్వీస్ గతంలో గోనెగండ్లలోని వైస్సార్ సర్కిల్ వరకు వెళ్లి అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ప్రయాణికులను ఎక్కించుకునేది. అయితే దాదాపు నెల రోజులుగా ఆ బస్సు వైస్సార్ సర్కిల్ వరకు వెళ్లకుండా గంజిహಳ್ಳಿ టర్నింగ్ దగ్గరే తిరిగి వెళ్తోంది. దీంతో గోనెగండ్లకు వచ్చే రోగులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు అలాగే బైలుప్పల, తెర్నేకల్ గ్రామాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బస్సును మళ్లీ వైస్సార్ సర్కిల్ వరకు నడపాలని గంజిహళ్లి వైఎస్ఆర్సిపి నాయకులు కోరుతూ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి గతంలో మాదిరిగానే బస్సు సర్వీసు యధావిధిగా నడుపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ తిరుమలరెడ్డి, మాజీ సర్పంచ్ రాముడు, మహేష్ రెడ్డి, వెంకట రాముడు, మల్లేష్, తిక్కయ్య, చార్లెస్, నరేష్, సుధాకర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.