కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో ఉత్సాహంగా “మన బడి – మన బాధ్యత

బిజెపి సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి

పయనించే సూర్యుడు జూన్ 14 శంకరపట్నం మండలం రిపోర్టరు పెద్ది గట్టయ్య :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సేవా సుపరిపాలన పూర్తి అయిన సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మన బడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట మండల కేంద్రంలోని కనగర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట పవన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలోని తరగతి గదులుపాఠశాల యొక్క ప్రాంగణం శుభ్రపరచడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని నాయకులుకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిఅభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అలాగే, గత విద్యా సంవత్సరంలో నిర్వహించినట్లుగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పదవ తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్లమెంట్ మొత్తం ఒకే రోజు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రధానమంత్రి సేవా భావం సుపరిపాలన స్ఫూర్తితో సమాజ హిత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి బూత్ అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాసరెడ్డి బండి సాంబరాజు బచ్చల రాజమహేందర్ కంచం రాజయ్య మట్ట అరవింద్ రెడ్డి మాడిజోడి రవి సామాను రామారావు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *