విశ్వబ్రాహ్మణ జాతి ఐక్యతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 14,తల్లాడ రిపోర్టర్ విశ్వబ్రాహ్మణ జాతి ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ సంఘం వ్యవస్థాపకుడు తూములూరి సత్యనారాయణ చారి పిలుపుమేరకు ఖమ్మం జిల్లా విశ్వ బ్రాహ్మణ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష నరసింహచారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి కాసోజు శంకరమ్మను (తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి తల్లి) ను సంఘం ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా హైదరాబాదులోని వారి నివాసంలో కలిసిన కాసోజు శంకరమ్మకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సమాజం అభివృద్ధి చెందాలంటే విశ్వబ్రాహ్మణ జాతి బిడ్డలంతా ఐక్యంగా ఉండాలని, సమాజ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని కోరారు. విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సామాజిక అభ్యున్నతి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ మహిళా కమిషన్ సభ్యురాలిగా మహిళల హక్కుల పరిరక్షణ, సాధికారత, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గుండోజు శ్రీనివాస్,జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి మండలోజు వరప్రసాద్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష నరసింహచారి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళోజు బ్రహ్మయ్య చారి,సంఘం నాయకులు నెమలికొండ గోవిందాచారి,దాట్ల కృష్ణమూర్తి, వెంకటాచారి,సంతోష్ కుమార్, సంజయ్ చారి,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *