రెండేళ్లలో పలు అభివృద్ధి పనులతో ఎమ్మెల్యే నానాజీ..

పయనించే సూర్యుడు జూన్ 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయ రంగ ప్రవేశం చేసి అభివృద్ధి లక్ష్యంగా కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ ఎన్నికైన రెండేళ్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గ ప్రజలు మెచ్చేలా తీర్చిదిద్దడం అభినందనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు అభివృద్ధి లక్ష్యంగా…. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా… ముందుకు సాగుతూ నియోజవర్గంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ0 దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. పార్టీల కతీతంగా విద్య, వైద్యం, తాగునీరు వంటి వాటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు అనుగుణంగా నిరంతరం గ్రామాలలో తిరుగుతూ జనం సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారని అన్నారు. నిధులు మంజూరైన వాటికి పనులు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపుతున్నారని అన్నారు. మొ0దా తుఫాను సమయంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సైక్లోన్ ఫైటర్ పురస్కారాన్ని నానాజీ అందుకున్నారని అన్నారు. నేటి వరకు సుమారు రూ. 260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజలతో మమేకమై అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. సుమారు రూ. 650 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు ,ప్రజాసంతృప్తి వంటి అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సర్వేలో కాకినాడ జిల్లాలో ఎమ్మెల్యే నానాజీ ద్వితీయ స్థానంలో నిలబడడం గర్వకారణం అన్నారు. శాసనసభలో పంచాయతీల విలీనం, 15వ ఆర్థిక సంఘం నిధులు, స్టాంప్ డ్యూటీ ,డ్రైనేజీల ఆక్రమణలు, తాగునీరు వంటి సమస్యలను ప్రస్తావించి శాస్త్రీయ పరిష్కారానికి సూచనలు చేశారని అన్నారు. కూటమి నాయకులతో సఖ్యతగా ఉంటూ ప్రజల మనోబీష్టానికి అనుకూలంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో తన మార్కు పాలన ఉండాలనే భావంతో బీచ్ పార్కు రూ. 4.56 కోట్లతో , పండూరు చెరువు ను పర్యాటక ప్రాంతంగా రూ. 50 లక్షలతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రానున్న మూడేళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారని అడబాల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *