పయనించే సూర్యుడు జూన్ 16 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ అధ్యక్షతన కర్నూలులో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభ అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సభా ప్రాంగణాన్ని నింపివేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సభకు నీటిపారుదల శాఖ మంత్రి, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అలాగే కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన దిశగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబాటుతో ముందుకు సాగుతోందని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని, రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో కర్నూలు జిల్లా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. సభలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమం మొత్తం పార్టీ శ్రేణుల ఉత్సాహం, క్రమశిక్షణ, ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలందరికీ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.