చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడి కేంద్రాలు కీలకం

పయనించే సూర్యుడు జూన్ 16 రాజేష్ ) దౌల్తాబాద్, జూన్ 16: చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్‌వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని సర్పంచ్ పంజ స్వామి అన్నారు. పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా అంగన్‌వాడి కేంద్రం వద్ద సోమవారం చెట్టు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం “అమ్మ మాట–అంగన్‌వాడి బడిబాట” కార్యక్రమం చేపట్టి చిన్నారులను అంగన్‌వాడి కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల శారీరక, మానసిక వికాసంతో పాటు పోషకాహారం అందించడంలో అంగన్‌వాడి కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రతి చిన్నారి అంగన్‌వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రేమ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి నరసింహ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు, ఉపాధ్యాయులు నవీన్ రెడ్డి, నర్సింలు, రజిత, జ్యోతిర్మయి, అంగన్‌వాడి టీచర్ సరోజన, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *