భారత సైన్యంలో అడుగుపెడుతున్న పెద్దహరివనం యువకుడు

పయనించే సూర్యుడు రిపోర్టర్ ఎరుకుల మహేష్) ఆదోని నియోజకవర్గంలోని పెద్దహరివనం గ్రామానికి చెందిన జిల్లా ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి హెచ్. గణేష్ ఇండియన్ ఆర్మీకి ఎంపిక కావడంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఆయన శిక్షణకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. రవీంద్ర, ఫిజికల్ డైరెక్టర్ జి. రామన్న మాట్లాడుతూ, గణేష్ సాధించిన విజయం పాఠశాలకు గర్వకారణమని తెలిపారు. క్రమశిక్షణ, కృషితో లక్ష్యాన్ని సాధించిన గణేష్ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాడని పేర్కొన్నారు.హెచ్. గణేష్ ప్రతిభావంతమైన కబడ్డీ క్రీడాకారుడని, పాఠశాల తరఫున అనేక పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు.ఈ సందర్భంగా గణేష్‌ను పాఠశాలకు ఆహ్వానించి ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిరంజీవి, నాగేంద్ర, రవికుమార్, విమల, ఆర్.బి. వెంకటేష్, నవీన్, కంప్యూటర్ వెంకటేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *