ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

పయనించే సూర్యుడు జూన్ 16 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్టివిస్ట్ సొసైటీ (ఆర్టిఐఏఎస్)-రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్ రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే “ఫీజుల నియంత్రణ చట్టం” తీసుకురావాలని ఆర్టిఐఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యా వ్యాపారమే పరమావధిగా సాగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల ధనదాహానికి సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా డా,, కొర్ర. కిషన్ నాయక్ మాట్లాడుతూ… ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. విద్యా ప్రమాణాలను పెంచడం పక్కన పెట్టి, కేవలం లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలను నడుపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల ప్రాంగణాల్లోనే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, టై, బెల్ట్, మరియు యూనిఫామ్‌లను విక్రయిస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపుతున్నాయని మండిపడ్డారు. బయట మార్కెట్ కంటే రెట్టింపు ధరలకు ఈ వస్తువులను పాఠశాలల్లోనే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం అన్యాయం అని అన్నారు. కళ్ళ ముందే ఇంతటి దోపిడీ జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించడానికి తక్షణమే ఒక బలమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించి స్కూల్ క్యాంపస్‌లలో పుస్తకాలు, యూనిఫామ్‌లు విక్రయిస్తున్న విద్యాసంస్థలపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి పాఠశాలలో ఫీజుల వివరాలను, నిబంధనలను పారదర్శకంగా బోర్డులపై ప్రదర్శించేలా చూడాలి. సామాన్యుడికి విద్యను దూరం చేస్తున్న ఇటువంటి వ్యాపార ధోరణిపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి,తనిఖీలు చేపట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *