పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మధ్యాహ్న భోజనం కార్మికులు సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం వంట కార్మికులకు వాగ్దానం చేసిన విధంగా పదివేల రూపాయలు వెంటనే పెంచి అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం స్థానిక సుందరయ్య భవన్లో నన్నీ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ వేసవి సెలవులు తర్వాత పాఠశాలలో పున ప్రారంభం అయ్యాయని పాత మెనూ ప్రకారం పెరిగిన ధరలతో విద్యార్థులకు వండి పెట్టడం అంటే కష్టంతో కూడుకున్న విషయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన మార్కెట్ ధరలను ఆలోచించకుండా అల్పాహారం రుచికరమైన ఆహారం అందిస్తామని ప్రకటనలు గుప్పిస్తుందని పెరిగిన ధరలతో ఏ రకంగా వంట చేయాలో వంట కార్మికులు తలలు పట్టుకుంటున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో కట్టెలకు గాని గ్యాస్ గాని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదని పెరిగిన ధరలతో గ్యాస్ ఏజెన్సీలు షరతులతో గ్యాస్ బండలు ఇస్తున్నాయని అన్నారు. పంట కార్మికులకు గ్యాస్ ఏజెన్సీ నిబంధనలను మార్చి పది రోజులకు ఒక గ్యాస్ బండ ఇవ్వాలని,పాఠశాలలో పాత వంట కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని,ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలకు తగ్గట్లు విద్యార్థుల మెనూ 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కోఆర్డినేటర్ రామారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం యూనియన్ మండల అధ్యక్షురాలు నన్ని కార్యదర్శి యామిని సీత వెంకటలక్ష్మి రమాదేవి పద్మ దశమి తదితరులు పాల్గొన్నారు.