విద్యాహక్కు చట్టం అమలు చేయాలి – బీఎస్పీ వినతి

కార్యక్రమంలో బీఎస్సీ ఉమ్మడి జిల్లా జోనల్ ఇన్చార్జి పృథ్వీరాజ్

పయనించే సూర్యుడు జూన్ 16 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ నాగర్‌కర్నూల్: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) ప్రకారం 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఉమ్మడి జిల్లా జోన్ ఇంచార్జ్ పృథ్వీరాజ్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ సి. కళ్యాణ్ మాట్లాడుతూ తాడూర్ మండలం ఇంద్రకల్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు కొత్త భవనం మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నీరటి రమేష్, బంకల దాస్, జైభీమ్ శంకర్, జన్ను ఆంజనేయులు, మధు, బాలరాజు, నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *