పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ జూన్ 4/26 జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు నడుస్తున్నటువంటి బాలికలుకు ఈ హెచ్ పి వి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది మన జూలూరుపాడు మండలంలో సుమారుగా 155 మంది బాలికలు 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు నడుస్తున్నటువంటి బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిను ఈరోజు నుండి ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది HPV వ్యాక్సిన్ ఇవ్వడం వలన మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారణ Vaginal మరియు vulvar క్యాన్సర్ల నివారణ పురుషులు మరియు మహిళల్లో మల ద్వారా అనాల్ క్యాన్సర్ నివారణ జననేంద్రియ మొటిమలు జనైటెల్ వర్డ్స్ నివారణ రాకుండా నివారించడానికి ఉపయోగిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు డా వెంకటేష్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ సూపర్వైజర్ రత్నకుమార్ హెచ్ వి రాధిక ప్రియదర్శిని శశికళ మరియు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు