యడ్లపాడులో మహానేత వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి..

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 09 యడ్లపాడు మండల ప్రతినిధి.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా యడ్లపాడు గ్రామంలోని మైదవోలు రోడ్డులో బుధవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యజ్ఞేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించిన మహానేత వైఎస్‌ఆర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, సంక్షేమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పి. ఝాన్సీ సాగర్, యడ్లపాడు గ్రామ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సుభాని, యడ్లపాడు మండల యూత్ అధ్యక్షుడు కొప్పుల శామ్యేల్ పాల్, వణుకూరి వెంకటప్పారెడ్డి, కోటి, సాయి తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *