అంగరంగ వైభవంగా ర్యాగటమ్మ జాతర

పయనించే సూర్యుడు జూన్ 16 రాజేష్) దౌల్తాబాద్, మండల పరిధిలోని శేరిపల్లి బందారం గ్రామంలో సోమవారం ర్యాగటమ్మ జాతరను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం చుట్టూ మహిళలు బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను అలరించాయి. జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై అరుణ్ కుమార్, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీతో జాతర ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం గంప రవి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, చలివేంద్రం నిర్వాహకులు గంప రవి, వెంకటేష్, సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *