పయనించే సూర్యుడు మే 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే.పురుషోత్తం రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో సుమారు 200 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పరిశీలించారు. ఇటీవలే స్లాబ్ కార్యక్రమం పూర్తి చేశారని మరిన్ని పనులు చకచకా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల రూపకల్పనకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టుదలతో నియోజకవర్గానికి పాఠశాల మంజూరు కాగా ఎంతో ఉదారతతో వెనుకబడిన కొందూరు మండలానికి ఈ పాఠశాలను కేటాయించి తన ప్రేమాభిమానాన్ని ఈ ప్రాంతంపై చాటుకున్నారని పురుషోత్తం రెడ్డి వివరించారు. పనులు ఎంతో నాణ్యతతో జరుగుతున్నాయని ఈ ప్రాంతాన్ని అత్యంత విద్యాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఈ ప్రాంతం ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. వీర్లపల్లి శంకర్ శాసనసభ్యుడిగా అయినప్పటి నుండి ఇప్పటివరకు కొందుర్గు ఉమ్మడి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి మండలంలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే భూసేకరణ తదితర పనులు కొనసాగే అవకాశం ఉందని ఈ ప్రాంతం భవిష్యత్తులో ఎంతో ఆర్థిక, విద్యాసంపదలు వెల్లివిరుస్తాయని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పరిశీలించిన వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీటీసీలు మల్లేష్ గౌడ్, అంజి రెడ్డి, సీనియర్ నాయకులు రాములు గౌడ్, ఎస్సీ సెల్ నరేందర్,నరేందర్ గౌడ్, రాజ్ కుమార్,మాదారి నర్సింలు, శ్రీనువాస్ రెడ్డి, శివకుమార్, సిద్ధు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు..