మండలంలో కొనసాగుతున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామసభలు

జగన్ న్యూస్ జూన్ 7 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలో జరిగినటువంటి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై మండలంలోని ఏలేటి రామయ్య పల్లి చింతకుంట రామయ్య పల్లి నవాబుపేట రామచంద్రపురం కైలాపూర్ కొత్తపేట బావు సింగ్ పల్లి గ్రామాలలో గ్రామ సర్పంచుల అధ్యక్షతన ముగింపు గ్రామసభలు ఎంపీడీవో జయశ్రీ నిర్వహించారు ఈ గ్రామ సభలలో ఎంపీడీవో జయశ్రీ మాట్లాడుతూ గ్రామ ప్రజలు రాబోయే వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలు వివిధ జ్వరాల బారిన పడకుండా పాటించవలసిన చర్యలపై అవగాహన కల్పిస్తూ సురక్షితమైన త్రాగునీటిని సేవించాలని ఇంటి వద్ద ఉండబడిన వ్యర్థ కుళ్ళిపోయిన పదార్థాలను తడి చెత్త పొడి చెత్త బుట్టలలో నిలువచేసి గ్రామపంచాయతీ వాహనాలకు తరలించాలని తెలిపారు అదేవిధంగా గ్రామంలో రైతులు ప్రజలు జలాలను సంరక్షించుకోవడం పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను పెంచుకోవాలని నేల తల్లిని కాపాడుకోవాలని గ్రామాలలో వర్షాకాల సీజన్లో వన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని మాట్లాడారు తదనంతరం స్థానిక తహసిల్దార్ వసంతరావు మాట్లాడుతూ గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కొరకు నిత్యం అందుబాటులో ఉంటానని గ్రామ ప్రజలకు రైతులకు తెలియపరుస్తూ అలాగే ఓటర్ల జాబితా సమగ్ర సర్వే జరిగే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు స్థానిక ఎస్సై వివిధ గ్రామాల వార్డ్ మెంబర్స్ ప్రజలు హాజరైనారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *