రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని పరామర్శించిన మురళీ కృష్ణంరాజు

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 03 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ ) : శంఖవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన యలమంచిలి సత్యవేణి, అలాగే ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జువ్వల శ్రీను కుమార్తె జ్యోతి శ్రావణి ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గాయపడి కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ కృష్ణంరాజు ఆసుపత్రికి వెళ్లి ఇద్దరినీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నల్ల వెంకటేష్,జువ్వల రాజా తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *