అక్రమ మొరం, ఇసుక తవ్వకం, నిల్వ మరియు రవాణాపై కఠిన చర్యలు –

కేసులు నమోదు చేయబడును. ఎస్సై శ్రీకాంత్

పయనించే సూర్యుడు, జూన్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల ప్రజలకు, వాహన యజమానులకు మరియు రవాణాదారులకు బచ్చన్నపేట ఎస్సై హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం లేదా ఇసుకను తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరం.అటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై, వారికి సహకరించే వాహన యజమానులు మరియు డ్రైవర్లపై సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతాయని తెలిపారు. అదేవిధంగా, అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం (సీజ్) చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోబడునని, ప్రభుత్వ సహజ వనరుల పరిరక్షణలో ప్రజలందరూ సహకరించాలని కోరడమైనది. ఎక్కడైనా అక్రమంగా మొరం లేదా ఇసుక తవ్వకం, నిల్వ లేదా రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే క్రింది నంబర్‌కు సమాచారం అందించగలరని ఫిర్యాదుల కోసం సంప్రదించవలసిన నంబర్: 8712685205 ప్రజల సహకారంతో అక్రమ తవ్వకాలు మరియు రవాణాను పూర్తిగా నిరోధించగలమని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *