అల్లూరి జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీపీఎం నాయకులు.

పయనించే సూర్యడు జులై.06.2026 మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి.సందర్భంగా కూనవరం మండలంలో సీపీఎం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి బాబు బొర్రయ్య మాట్లాడుతూ…దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.గిరిజనుల హక్కులు,స్వాభిమాన పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం.నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.అల్లూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని,సామాజిక న్యాయం,ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *