పయనించే సూర్యుడు న్యూస్, జూలై 05 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : పట్టణంలోని స్థానిక వినోద్ మిశ్ర నగర్ లో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వర్రావ్ సూచనల మేరకు పార్టీ సభ్యులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ మిశ్రా పార్టీ సభ్యులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం అతి చిన్న వయసులో సంవత్సర కాలంలో ఉద్యమం నడిపించి ప్రాణాలర్పించిన వీరుడు బ్రిటిష్ బానిసత్వం నుండి విముక్తికై మన్యంలో గిరిజనులను చైతన్యవంతులను చేసి బ్రిటిష్ పాలకులను నిద్ర లేకుండా ఉద్యమం చేసి బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ స్టేషన్లను పై దాడులు చేసి చరిత్రలో నిలిచిన అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ కమిటీ కార్యదర్శి గండేటి నాగమణి, సహాయ కార్యదర్శి కందుల కృప ప్రసాద్, యువజన సంఘం నాయకులు కందుల క్రాంతి కుమార్, మహిళా సంఘం నాయకురాలు గుమ్మడి పాదాలమ్మ,చాచపల్లి సీత, గునపు వరలక్ష్మి, పచ్చిమళ్ళ సుబ్బలక్ష్మి, సందక లక్ష్మిపందిరి సుబ్బారావు, దుక్క నూకమ్మ, కొంచెం సోమరాజు తదితరులు పాల్గొన్నారు