ఆదోనిలో బయల్పడిన ప్రాచీన శిలా సంపద

పయనించే సూర్యుడు జూన్ 14 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలో పురాతన శిలా సంపద వెలుగులోకి వచ్చింది. ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలోని శ్రీరామాలయానికి వెళ్లే మార్గంలో పూరాతన కాలం నాటి రాతి శిల్పాలు, నంది విగ్రహాలు, దేవతా విగ్రహాలు, శిలా స్తంభాలు బయటపడ్డాయి. వీటిపై ఉన్న కళా ఆకృతులు, చెక్కబడిన శిల్పాలు అప్పటి చరిత్ర, సంస్కృతికి అద్దం పడుతున్నాయి. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ శిలా సంపదను భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. పురాతన ఆలయ నిర్మాణం, చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *