ఆదోని మున్సిపాలిటీ కే శుభ్రత లేకపోతే, ఆదోని శుభ్రంగా ఉండేనా??

పయనించే సూర్యుడు జూన్14ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ఆదోని మున్సిపాలిటీ కార్యాలయం చిన్నపాటి వర్షానికే జలమయంగా మారి అపరిశుభ్రతకు కేంద్రంగా మారిందని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ వెంకటేష్ విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్యాలయంలో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను అనేకసార్లు మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్యాలయాన్నే సక్రమంగా నిర్వహించలేకపోతే, ఆదోని పట్టణ ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి మున్సిపాలిటీ కార్యాలయంలోని నీటి నిల్వ, పారిశుద్ధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ తరఫున డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ముందుగా మున్సిపల్ కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *