ఆర్మీలో ఎంపికైన జవాన్లకు శ్రీ శ్రీ కోదండ రామచంద్రస్వామి ఆలయం లో సన్మాన సభ

పయనించే సూర్యుడు గాంధారి 04/06/26 తిప్పారం తాండ శ్రీ శ్రీ కోదండ కోదండ రామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన భారత ఆర్మీలో ఉద్యోగంలో ఎంపికైన మండల కేంద్రంలోని 25 మంది సైనికులకు అభినందన సన్మాన సభను బిషన్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభలో మొత్తం 25 మంది ఆర్మీ జవాన్లను సన్మానించడం జరిగింది. వారికి పలు సూచనలు ఇస్తూ మీలాగా ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులు పలు ఉద్యోగాలలో నియామకం కావాలని, అలాగే పట్టుదలతో చదివితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ఎంఈఓ శ్రీహరి తెలిపారు. పేదరికంలో ఉండి చదువుకు దూరం గా ఉన్న విద్యార్థులకు సహాయం అందించేలా కృషి చేస్తామని తిప్పారం తాండ గ్రామ ప్రజలు తెలిపారు.ఈ సభలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర లభాన అధ్యక్షులు తాన్ సింగ్ నాయక్, మాజీ జెడ్పిటిసి శంకర్ నాయక్, మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి, ఉప సర్పంచ్ గోపాల్, బస్సి నర్సింగ్, పెంటయ్య(టీచర్), వార్డ్ మెంబర్లు తాన్ సింగ్, రామ్చంద్, మరియు న్యాల్ సింగ్ ఈ సభకు అధ్యక్షత వహించిన అటువంటి భిషన్ నాాయక్ , లబాన సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బస్సీ తాన్సింగ్ నాయక్ గాంధారి మాజీ zptc శంకర్ నాయక్ Meo శ్రీహరి ,ఉపసర్పంచ్ మంజ గోపాల్ లబాన సమాజ్ మండల యూత్ అధ్యక్షుడు బస్సీ నర్సింగ్ టీచర్ పెంటయ్య బస్సీ తాన్ సింగ్, పరశురాం మహారాజ్ ,గ్రామ ప్రజలు,సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *