ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భద్రతను తిరిగి పునరుద్దించాలి

తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్ పల్లి శ్రీనివాస్

పయనించే సూర్యుడు ) 3 – 7 – కొడంగల్ నియోజకవర్గం : – కొడంగల్ మండల కేంద్రంలో స్వేరోస్ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రన్ పల్లి శ్రీనివాస్, స్వేరోస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ బోర్డు వెంకటేష్, బీసీ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లులు, మాట్లాడుతూ.డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేశం కోసం 26 సంవత్సరాలు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి దేశ రక్షణకై దేశం యొక్క సమగ్రతపై పాటుపడుతూ పనిచేసినటువంటి వ్యక్తికి లక్షల మందికిపైగా జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తికి ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భద్రతను తగ్గించడం సరికాదన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి సెక్యూరిటీని బుల్లెట్ ప్రూఫ్ కార్ 2 ప్లస్ 2 ఎక్స్ కేటగిరీని మళ్లీ తిరిగి పునరుద్ధరించాలని. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుండి స్వేరోస్ ప్రజా సంఘాల సమక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాము అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గౌరీగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *