పయనించే సూర్యుడు జులై 03, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల నాగార్జున బీఎల్‌ఏలతో కలిసి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్)కు సంబంధించిన ఫారాలను ప్రజలకు అందజేసి, ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా నమోదై ఉండేలా ప్రతి కుటుంబం సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు తమ వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఎల్‌ఓ చామర్తి కృష్ణమాచారి, కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి రమేష్, కాశీమల శ్రీను, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.