ఇసుక రీచ్ ను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల భూగర్భ

మరియు ఎక్స్ఎన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

పయనించే సూర్యుడు మే 22 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తో కలిసి ఇసుక రీచ్‌ను పరిశీలించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మఈ సందర్భంగా ఇసుక తవ్వకాల నిర్వహణ, ప్రజలకు ఇసుక సరఫరా, పారదర్శక విధానాలు మరియు అక్రమ రవాణా నివారణపై అధికారులు మరియు స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సరసమైన ధరలకు ఇసుక అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే ఇసుక రీచ్‌ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా పాలన అందిస్తోందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *