పయనించే సూర్యుడు న్యూస్ :మే 31,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ఈ ప్రమాదం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న రేకు బారికేడును ఢీకొట్టింది… ఢీకొన్న అనంతరం కారు పల్టీలు కొట్టి హైవేపై ఎగిరిపడింది. కారును నడుపుతున్న స్వర్ణకంటి జస్వంత్ (36) అలియాస్ అశోక్ , హైదరాబాద్ నివాసి అక్కడికక్కడే మృతి. మృతుడు బొల్లారం పోలీస్ స్టేషన్లో 2021 బ్యాచ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.. ప్రమాదంలో జస్వంత్ భార్య జ్యోతి కిరణ్ మౌనిక కాలు విరిగింది. వారి కుమార్తె మాన్య (6) కాలుకు గాయాలయ్యాయి. కుమారుడు కళ్యాణ్ రామ్ (4) ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కుటుంబ సభ్యులు అన్నవరం దేవస్థానం దర్శించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన భార్య, పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…