ఘనంగా దివ్యాంగుల ఆత్మీయ జిల్లా స్థాయి సమ్మేళనం.

దివ్యాంగుల న్యాయమైన కోరికలను పరిష్కరిస్తాం.

పయనించే సూర్యుడు జూన్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్కర్నూల్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం మరియు అనుబంధం వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యపాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా వికలాంగుల నుంచి అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, మోటర్ వెహికల్, సదరం ధృవ పత్రాల సమస్యలు, ఉపాధి కోసం వికలాంగులు వినతి పత్రాలు చైర్మన్ ముత్తినేని వీరయ్య కు అందించారు.ఈ కార్యక్రమoలో దివ్యాంగులతో ముఖాముఖి సమావేశం,సంక్షేమ కార్యక్రమాల ప్రగతి సమీక్ష నిర్వహించారు. దివ్యాంగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.గత 60 రోజుల్లో 29 జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించిన అనుభవంతో, తెలంగాణలోని ప్రతి దివ్యాంగుడి చెంతకు చేరుకుని వారి సాధికారత కోసం మా ప్రయాణం నిరంతరం కొనసాగుతోంది అన్నారు.జిల్లాలోని వికలాంగులు 650 పాల్గొన్నారు.అనంతరం సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు నరాందాస్ శ్రీశైలం ప్రధాన కార్యదర్శి మొల్గర పరుష రాములు, బంగారి పర్వతాలు కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు బిజినపల్లి మండల, అధ్య క్షులు వెంకటస్వామి, తెల్కపల్లి మండల అధ్యక్షులు గంటా తిరుపతిరెడ్డి, తాడూరు మండల అధ్యక్షులు కొప్పులూరి సైదులు , తిమ్మజిపేట్ మండల అధ్యక్షులు వి శంకర్ ,నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు మంతటి శేఖర్,అన్ని మండలాల అధ్యక్షులు, అన్ని గ్రామాల దివ్యాంగుల సోదరులు,వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *