10వ తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు ఘన సన్మానం – పాలెం జెడ్పీహెచ్‌ఎస్‌లో

పయనించే సూర్యుడు జూన్ 16 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నూతన విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభమైన సందర్భంగా పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేసి ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాల నుంచి 103 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా, ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడం పాఠశాలకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది. ఈ సందర్భంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టాపర్లతో పాటు బాసర ట్రిపుల్ ఐటీలో అర్హత సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించారు. విద్యార్థుల కృషిని ప్రోత్సహించేందుకు ఒక్కొక్కరికి రూ.1,116 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *