జన్మదిన వేడుకల్లో భాగంగా ఉమామహేశ్వరుని దర్శించుకున్న యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు కొడిదల రాము

పయనించే సూర్యుడు జూన్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు కొడిదల రాము జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సకుటుంబ సపరివారంగా సోమవారం ఉమామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ డైరెక్టర్ దాశరధి పవన్ కుమార్ చొరవతో ఆలయ అర్చకులు ప్రత్యేక దర్శనం కల్పించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అచ్చంపేట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కొడిదల రాముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయించి సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చి రాములు, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శత్రు నాయక్, అంతటి మల్లేష్, నరసింహ, శ్రీనివాస్, రాజగోపాల్, కృష్ణ నాయక్, సునీల్, వినోద్, నాగర్‌కర్నూల్ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు వెల్టూరి రేణయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథం, ఉప్పునుంతల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేడముని భాస్కర్, అశోక్, సురేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కొడిదల రాము ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని నాయకులు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *