కష్టాల్లో ఉన్నాము మా కుటుంబాన్ని ఆదుకోండి..సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మొరపెట్టుకుంటున్న పుల్ల రమణమ్మ ఆవేదన..

పయనించే సూర్యుడు మే 26, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) వివరాల్లోకెళ్తే.. కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ మండలం, సర్పవరం గ్రామానికి సంబంధించి రేపల్లె వాడ లో నివసిస్తున్న పుల్ల శేషగిరిరావు రమణమ్మ దంపతులు కు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పుట్టుకతోనే వికలాంగుడు, చిన్న కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ పెళ్లయి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రెండు ఏళ్ళ క్రితం పచ్చకావులతో మరణించడంతో కుటుంబ భారం అంతా కుటుంబ పెద్దయిన పుల్ల శేషగిరిరావు మీదనే పడింది టాక్టర్ నడుపుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో షుగర్ వ్యాధి రావడంతో రెండేళ్లుగా మంచాన పట్టి ఉండడంతో కుటుంబ పోషణ కష్టమయ్యింది. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్న ట్రాక్టర్లు కూడా అమ్ముకోవడం జరిగింది. కుటుంబాన్ని ఆదుకునే పెద్దాయనకు షుగరు రావడం తో నడవలేని పరిస్థితుల్లో మంచం పట్టడం జరిగిందని తెలిపారు. ఆదుకునే వారు ఎవరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆర్థికంగా కష్టాలు పాలవుతున్నామని అప్పులు తీర్చడానికి ఇల్లును కూడా అమ్ముకుంటున్నామని, ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నామని అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నామని ఆవేదంతో పుల్ల రమణమ్మ మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెద్దకొడుకు వికలాంగుడు, రెండో కుమారుడు రెండేళ్ల క్రితం పచ్చకాలతో మరణించాడు. నా భర్త, మా చిన్న కోడలు ఇద్దరు మనవళ్లు, మా పెద్ద కొడుకు మరియు నా తల్లిని చూసుకునే బాధ్యత నా పైన ఉందని తెలిపారు. ఆఖరికి భర్త లేని చిన్న కోడలు ఆశ వర్కర్ పోస్టుకి అర్హురాలైన మా జనసేన పార్టీ గ్రామ ఊరు పెద్ద కు మోర పెట్టుకున్న కనీసం పట్టించుకోలేదని ఆవేదం వ్యక్తం చేశారు. నా చిన్న కుమారుడు జనసేన పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డాడని మా కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆర్థిక భరోసా ఇచ్చి ఆదుకోవాలని ఆవేదంతో కన్నీరు మున్నీరు అయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *