పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 2, తల్లాడ రిపోర్టర్ వైరా మండలం పరిధిలోని పుణ్యపురం గ్రామంలో ఏడు నెలల గర్భిణీగా ఉన్నప్పుడే కవల పిల్లలకు జన్మనిచ్చిన సత్యకాంత్ భార్య రేణుక దంపతులకు కవల పిల్లల్లో ఓ బాలుడి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, చికిత్స నిమిత్తం మార్చి 4వ తేదీన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించే క్రమంలో, కాన్యులా ఏర్పరచిన స్థలంలో వాపు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పినా పెద్ద సమస్య కాదని దాటివేసిన డాక్టర్లు ఎన్ని రోజులైన వాపు తగ్గకపోవడం, చేయి నల్లగా మారడంతో మరో సారి నిలదీయగా, వెళ్లి ప్రైవేటులో స్కానింగ్ తీసుకొని రండి అంటూ వైద్యుల నిర్లక్ష్యపు సమాధానం స్కానింగ్ రిపోర్టులో చేతిలో కణజాలు దెబ్బతిని, చేయి పూర్తిగా దెబ్బ తిన్నదని రావడంతో డాక్టర్లను నిలదీసిన బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి వెళితే వెంటనే నయం చేస్తారని చెప్పడంతో, మార్చి 26వ తేదీన నిలోఫర్ ఆసుపత్రికి తరలింపు అక్కడి వైద్యులు బాలుడి చేయి పూర్తిగా దెబ్బ తిన్నదని, చేతిని తొలగించాలని చెప్పడంతో కుప్పకూలిపోయిన బాలుడి తల్లిదండ్రులు చేసేదేమీ లేక బాలుడి చేయి తొలగించేందుకు అంగీకరించిన బాలుడి తల్లిదండ్రులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు వికలాంగుడిగా మారాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు తగిన న్యాయం జరగడానికి కోరుకుంటున్నారు.