గ్రామ దిఫికలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జాక్ మరియు ధర్మ సమాజ్ పార్టీ మద్దతు

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 2, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల కేంద్రముగా గ్రామ దిఫికల కనీస గౌరవం వేతనం ఇరవై వేలు పెంచాలని గత పది రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న గ్రామ దిఫికల దీక్ష శిబిరాన్ని బీసీ, ఎస్సీ,ఎస్టీ జాక్, సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు మేడి బసవయ్య మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ లో ప్రజాపాలన పేరు తో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసిందని రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని గ్రామ దిఫికల న్యాయమైన డిమాండ్ ను తక్షణమే పరిష్కరించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అదే విధంగా శివన్ మహారాజ్ మాగంటి మాట్లాడుతూ కమ్మ రెడ్డి రాజ్యం లో విద్య ,వైద్యం, భూమి, ఇల్లు, ఉపాధి లేక ప్రజలు కడు పేదరికంలో బతుకుతున్నారని రాజ్యాధికారం బీసీ,ఎస్సీ,ఎస్టీ ప్రజలకు రావడం ద్వారా నే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కిన్నెర శివ క్రిష్ణ తాళ్ళూరి రాజా గ్రామ దిఫికల డిమాండ్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ స్పందించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *