ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 అమీనా కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నంద్యాల శాంతి రామ్ కంటి ఆసుపత్రి వారిచే యాడికి మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ దగ్గర అమీనా ఆప్టికల్స్ లో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరానికి వివిధ కంటి జబ్బులు ఉన్న 60 మందికి కంటి వైద్య నిపుణులు తిప్పే స్వామి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 18 మందికి కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఆపరేషన్ల కొరకు వెళ్లే వారికి ఉచిత బస్సు, భోజన వసతి సౌకర్యము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమీనా కంటి ఆసుపత్రి యజమాని సయ్యద్ , తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *