ఉపాధి కూలీల ముఖ హాజరు .( పేషియల్) విధానం రద్దు చేయాలని సిపిఎం డిమాండ్.

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 అరకులోయ టౌన్ రిపోర్టర్. అల్లూరిజిల్లా కలెక్టర్ వినతి. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. తామర్ల సూర్యనారాయణ. ఉపాధి హామీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.పోతురాజు మాట్లాడుతూ వలస నివారణకు అమలు చేసిన ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుం దాన్నారు బివిజి రాంజీ పేరుతో నూ తన విధానాన్ని ప్రవేశ పెట్టడంతో ఉపాధికూలీలు సరైన సిగ్నల్ లేక .సాంకేతిక సమస్యల కారణంగా పేషియల్ ఆబ్సెంట్ అవ్వడం తో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నీ అన్నారు.ఉపాధి కూలీల పనిదినాలు 200.రోజులు పెంచాలని. రోజు కూలీ రూ .600 ఇ వ్వాలని జిల్లా కలెక్టర్ వారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు. పాంగి. డొంబు. పాంగి మోహన్ దాస్.కొర్ర. లైకోన్. కొర్ర. రాజు.వంతల.కేశవరావు. కొర్ర.దాసుబాబు. కొర్ర.సన్యాసిరావు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *