పయనించే సూర్యుడు.. న్యూస్..03 భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ సమావేశం బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో ని పార్టీ కార్యాలయం లో జరిగింది ఈ సందర్బంగా పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్ జి అనేది గ్రామీణ ఉపాధి రంగాన్ని పూర్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త చట్ట బద్దమైన పథకం అని అన్నారు ఈ వినూత్న పథకం జూలై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిందని అన్నారు ఇదివరకు ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు 125 రోజుల ఉపాధి హామీ అని అన్నారు ఇంతకుముందు ఉపాధి హామీ కింద ఏడాదికి 100 రోజుల పని లభించేదని కానీ ఈ కొత్త చట్టం ప్రకారం, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల ఉపాధిని చట్టబద్ధంగా గ్యారెంటీ ఇస్తారని, కనీస వేతనం పెంపు అని అన్నారు ఈ పథకం కింద దేశంలో ఎక్కడా కూడా రోజువారీ కూలి 300 రూపాయల కంటే తక్కువ ఉండకూడదని, దీనివల్ల దేశవ్యాప్తంగా సగటు రోజువారీ కూలి సుమారు 327.4 రూపాయలకు పెరిగింది గతంలో ఇది 298.8 రూపాయలుగా ఉండేదని,వ్యవసాయ సీజన్ల కోసం ప్రత్యేక నిబంధన 60 రోజులు రైతులకు పనుల సీజన్ లో నాట్లు, కోతల సమయంలో కూలీల కొరత రాకుండా ఉండటం కోసం, ఒక సంవత్సరంలో గరిష్టంగా 60 రోజుల పాటు ఈ పథకం పనులను నిలిపివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అన్నారు, ఈ విషయాన్నీ పార్టీ శ్రేణులు బూత్ స్థాయిలో బాధ్యత మండల కమిటీ సభ్యులదేనని అన్నారు ఈ సమావేశం లో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు, మండల అధికార ప్రతినిధి సూరేపల్లి జ్ఞానరత్నం,సయ్యద్ మోహినూద్దీన్ కొండా హర్షవర్ధన్, కొదమగుండ్ల స్వామిదాస్, రావేళ్ల మురళి కందరబోయిన గోపి, దేశబోయిన వేణుబాబు తదితరులుపాల్గొన్నారు