వరిగడ్డికి పెట్టిన నిప్పు అంటుకొని పామాయిల్ దగ్ధం.

పయనించే సూర్యుడు మే 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండల కేంద్రమైన ఏన్కూర్లో గుర్తుతెలియని వ్యక్తులు వరిగడ్డికి నిప్పు పెట్టడంతో దగ్గర్లో ఉన్న పామాయిల్ మొక్కలకు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. ఏన్కూరుకి చెందిన రైతు మేడా శ్రీనివాసరావు రేపల్లెవాడ రోడ్డులో గల తమ పొలంలో పామాయిల్ తోట వేశాడు. పామాయిల్ చుట్టూ ఫెన్సింగ్ అమర్చాడు. పామాయిల్ చుట్టూ పక్కల వరి పొలాలు కోశారు. వరి పొలాల్లో గడ్డికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పు అంటించడంతో వరిగడ్డి కాలుకంటూ వచ్చి పామాయిల్ మొక్కలకు అంటుకుంది. పామాయిల్ మొక్కలతోపాటు ఫెన్సింగ్ తీగ కాలిపోయింది. పామాయిల్ కు మంచి రేటు ఉండటంతో నెలకి రెండుసార్లు కటింగ్ వస్తుందని రైతు తెలిపారు.సుమారు మూడు సంవత్సరాలు పామాయిల్ తోట కావడంతో మంచి కాపు కాస్తుందని 20 పామాయిల్ మొక్కలు కాలిపోవడంతో చాలా వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు మేడ శ్రీనివాసరావు దంపతులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *