ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ శాఖ కమిటీ నియామకం

* గో టు విలేజ్ –40 డేస్ కార్యక్రమంలో భాగంగా బాధ్యతల అప్పగింత *ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపు

పయనించే సూర్యుడు 12-6-2026 గొల్లపల్లి మండల ప్రతినిధి (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల పరిధిలోని తిరుమలాపూర్ (పి.డి) గ్రామానికి లో గురువారం ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ శాఖ కమిటీ ని నియమించారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెవులమాద్ది రమేష్, ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు.గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఆరెల్లి రవీందర్, ఉపాధ్యక్షుడిగా బరిగెల మహేష్, బరిగెల నరేష్, కొత్తూరి మహేష్, ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి అంజయ్య, కార్యదర్శులుగా నేరెళ్ల ఆశయ్య, చంటి వంశీ,లను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “గో టు విలేజ్ – 40 డేస్” కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ కమిటీని నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కృషి చేయాలని, మాదిగల హక్కులు, అభ్యున్నతి కోసం ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా త్వరలో జరగనున్న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలోని కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ జెండా గద్దె కు మగ్గు పోయడం జరిగింది. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రేగుంట బాబు మాదిగ, ప్రధాన కార్యదర్శి మనల నరేష్, మండల సోషల్ మీడియా ఇన్చార్జి గంగాధర మధుసూదన్,సంఘాల సభ్యులు తదితరులు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *