భూటాన్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన బిందు రాథోడ్‌కు కలెక్టర్ సన్మానం

పయనించే సూర్యుడు,జూన్ 12 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): భూటాన్‌లో జరిగిన అంతర్జాతీయ అట్య పట్య ఏషియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన జహీరాబాద్ హోతి (కె) రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని బిందు రాథోడ్‌ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి, నోట్ బుక్స్ అందించారు. ఈ సందర్భంగా టిబిఇఎస్ఎస్ నాయకులు బిందు రాథోడ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిబిఇఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తులసిరామ్ రాథోడ్, హీరాలాల్ చవ్వాణ్, జైసింగ్ చవ్వాణ్, పాఠశాల ప్రిన్సిపాల్ విట్టల్, గోర్ సేన నాయకుడు జగన్ తదితరులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *