పయనించే సూర్యుడు, జూన్ 5 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ గ్రామ పంచాయితీ అభివృద్ధి మరియు కెఎల్ఐ కాలువ పై బ్రిడ్జి నిర్మాణం కోసం గురువారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే స్వగృహంలో సర్పంచి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, రైతులు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ని మర్యాదపూర్వంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి సంబందించిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే తో చర్చించారు. రైతులు కాలువ ఇరువైపులా ఉన్న పంట పొలాలకు పోవడానికి ఇబ్బందిగా ఉంది కాలువ పై బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. కాల్వ పై బ్రిడ్జి నిర్మాణాన్ని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేవల్లి రంగయ్య, మాసుల బాలరాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ గౌడ్, బొక్కల శ్రీనివాస్, పుట్ట యాదయ్య, క్యాసరపు తిరుపతి, జంగిలి బలరాం, కాళ్ల బాలస్వామి, ఏకుల శ్రీను, నిరటి యాదయ్య, జంగిలి శ్రీను, జంగిలి రవి తదితరులు ఉన్నారు.