ఏఐ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలి – ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 8 జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయాన్ని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తో కలిసి ఈ రోజు సందర్శించిన ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ . గ్రంథాలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి, విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో సంప్రదాయ విద్యతో పాటు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమన్నారు. _చీట్.జీపిటీ, జెమిని వంటి ఏఐ ఆధారిత సాంకేతిక వేదికలను విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పోటీ పరీక్షల తయారీ, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. _కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాలు కేవలం పుస్తక పఠన కేంద్రాలుగానే కాకుండా, డిజిటల్ నాలెడ్జ్, ఏఐ.మరియు సాంకేతిక విజ్ఞానానికి కేంద్రాలుగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఎం.ఎస్. బేగ్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన ఆధునిక వనరులు అందుబాటులోకి తీసుకురావడానికి గ్రంథాలయ పరిషత్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి దేవస్థానం చైర్మన్ గుమ్మా వెంకటేష్,సయ్యద్ అన్వర్, అస్లామ్,జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వి. రవికుమార్, గ్రంథాలయ అధికారి మస్తాన్ వలీ మరియు గ్రంథాలయ సిబ్బంది శ్యామల పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *