కపిల్ విద్యా వారధి ఫౌండేషన్‌లో సరస్వతికి చోటు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 07 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం భూపతిపూర్‌కు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని మామిడిపల్లి సరస్వతి కపిల్ విద్యా వారధి ఫౌండేషన్‌లో ఎంపికైంది. ఫౌండేషన్ ద్వారా ఆమెకు ఆరు సంవత్సరాల ఉన్నత విద్యకు పూర్తి సహాయం అందనుంది. సరస్వతి పదో తరగతిలో 566 మార్కులు సాధించడంతో పాటు ట్రిపుల్ ఐటీలో కూడా సీటు పొందింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు యు.వి. రమణి, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ భావన మహేందర్, ప్రజాప్రతినిధులు ఆమెను అభినందించి ఉజ్వల భవిష్యత్తు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *