ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : సిపిఎం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 7,తల్లాడ రిపోర్టర్ సిపిఎం సత్తుపల్లి డివిజన్ కమిటీ సమావేశం తల్లాడ సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగరావు అధ్యక్షత వహించారు ఈ సమావేశం సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం నాయకులు విమర్శించారు. సిపిఎం సత్తుపల్లి డివిజన్ కమిటీ సమావేశంలో మాట్లాడిన నాయకులు ప్రజలపై పెరుగుతున్న ధరల భారం, నిరుద్యోగం, విద్య, వైద్యం, తాగునీరు, గృహ వసతి వంటి సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు, ఉపాధి హామీ పనులకు తగిన నిధులు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, సిపిఎం డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు తన్నేరు కృష్ణార్జునరావ్, సిపిఎం మండల కార్యదర్శి తల్లాడ అయినాల రామలింగేశ్వరరావు, సిపిఎం పెనుబల్లి మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, సత్తుపల్లి టౌన్ కార్యదర్శి కొలికి పోగు సర్వేశ్వరరావు, సిపిఎం వేంసూర్ మండల కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్రావు, డివిజన్ కమిటీ సభ్యులు మోహన్ రావు, రావుల రాజబాబు, కృష్ణయ్య, పుల్లయ్య, శీలం కరుణ, పాకలపాటి ఝాన్సీ, మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *