ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు కొడదెల రాము

శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో ఘన సన్మానం

పయనించే సూర్యుడు జూన్ 6 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్, పాలమూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి నీ నాగర్‌కర్నూల్ యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు కొడదెల రాము మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. పాలమూరు నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొడదెల రాము అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *