ప్రత్తిపాడు అనాధ ఆశ్రమంలో వృద్ధులకు భోజనం పొట్లాలు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 16 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి వద్ద ఉన్న అనాధ శరణాలయంలో వృద్ధులకు వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో వక్కలంక రమాకాంత్ భార్య వక్కలంక సత్య జ్ఞాపకార్థంగా సుమారు 30 మందికి భోజనం పొట్లాలను ఆర్థిక సాయంతో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని ఎవరైనా పెళ్లిరోజు, పుట్టినరోజు తదితర కార్యక్రమాలు ఏమైనా ఉంటే మా సంస్థ ద్వారా వృద్ధులకు, అనాధలకు దాతల ఆర్థిక సహకారంతో భోజనాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు సారా శ్రీను,దాసరి కృష్ణ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *