పయనించే సూర్యుడు న్యూస్ :జులై /03:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలో బెజ్జంకి మండలానికి సముచిత ప్రాధాన్యం లభించింది. ప్రకటించిన జిల్లా కార్యవర్గంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా డా. పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిట్టి రాజు, జిల్లా కార్యదర్శిగా అక్కరవేణి పోచయ్య, జిల్లా కార్యనిర్వాహక సభ్యుడిగా శీలం నర్సయ్య నియమితులయ్యారు. జిల్లా కమిటీలో స్థానం పొందిన నాయకులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ హృదయపూర్వకంగా అభినందించారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీలో బెజ్జంకి మండల నాయకత్వానికి ప్రాధాన్యం కల్పించిన పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.