గొల్లపల్లి చింతకుంటపల్లెలో పశువులకు లంపీ వైరస్ నిరోధక టీకాల కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ :జులై /03:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని గొల్లపల్లి చింతకుంటపల్లె గ్రామ రైతుల పశుసంపదను రక్షించే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్) ఆధ్వర్యంలో లంపీ స్కిన్ వైరస్ నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఆవులు, లేగదూడలకు ఉచితంగా లంపీ వైరస్ నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్ ) మాట్లాడుతూ, పశువుల ఆరోగ్య పరిరక్షణ రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో ముఖ్యమని, ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పశువులకు టీకాలు వేయించుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన పశుసంవర్ధక శాఖ డాక్టర్ పూర్ణచంద్రిక, ఉపసర్పంచ్ ఒరుపుల లక్ష్మణ్, మరియు వార్డు సభ్యులు పత్రిఅంజయ్య దాసరి ఎల్లయ్య రడం బాబాయి ముద్దల అజయ్ పంచాయితి కార్యదర్శి సతీష్ ఆరిఫ్ మరియు సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *