పయనించే సూర్యడు పత్రిక జూలై 03 గోకవరం మండల రిపోర్టర్ దొరబాబు: మంచి సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న కిర్లంపూడి మండలం, పాలెం గ్రామ నివాసి, క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బొడ్డేటి అప్పారావు నేటి యువతకు ఆదర్శప్రాయుడని పాటంశెట్టి సూర్యచంద్ర కొనియాడారు శ్రీ బొడ్డేటి అప్పారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను సూర్యచంద్ర ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ,అప్పారావు తన పుట్టినరోజున 28వ సారి రక్తదానం చేయడం ఆయన సామాజిక బాధ్యతకు, సేవానిరతికి నిదర్శనమని ప్రశంసించారు.ఒకవైపు సామాజిక సేవ చేస్తూనే, మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం తపన పడుతుంటారని పేర్కొన్నారు.గ్రామాల్లోని, మండలంలోని ప్రజా సమస్యలను స్వయంగా గుర్తించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి,సమస్యల తీవ్రతను వివరించి వాటిని పరిష్కరించే వరకు అప్పారావు చేసే నిరంతర ప్రయత్నాలు ఎంతో అభినందనీయమని సూర్యచంద్ర కొనియాడారు. సమాజ హితం కోరే ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని సూర్యచంద్ర కోరారు