కారు స్కూటర్ ఢీ : ఒకరికి గాయాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 23.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// కారు స్కూటర్ ఢీకొని ఒకరు గాయపడిన సంఘటన శుక్రవారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది చౌడేపల్లి- పుంగనూరు ప్రధాన రహదారిలో తిరుపతి నుంచి పుంగనూరు కి వెళ్తున్న కారు పుంగనూరు నుంచి చౌడేపల్లి వైపు వస్తున్న స్కూటర్లు పుదీపట్ల కోళ్ల ఫారం వద్ద ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో పంచలింగాల కొత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం 25 కాలుకు బలమైన గాయమైంది గాయపడ్డ అతన్ని 108 పైలెట్ చిట్టిబాబు ఈఎంటి హరిబాబు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *