తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

పయనించి సూర్యుడు జూన్ 5 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట (అ) మండలం పరిధిలోని మక్తా లక్ష్మాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించబడింది గ్రామ సభలో వర్షాకాల సంసిద్ధత తాగునీటి సరఫరా గ్రామ పరిశుభ్రత ఘన వ్యర్థాల నిర్వహణ జల సంరక్షణ హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమాలు మరియు గ్రామాభివృద్ధికి సంబంధించిన ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల పరిశుభ్రత పచ్చదనం తాగునీటి సదుపాయాలు మరియు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు గ్రామ ప్రజలు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు గ్రామ ప్రజలు తెలియజేసిన సమస్యలు సూచనలను నమోదు చేసి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అకుల శ్రీనివాస్ ఏపీఓ సంతోష్ కుమార్ పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్ వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *